📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకానుకుంట గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిక

కానుకుంట గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిక

📰 Generate e-Paper Clip

కానుకుంట గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిక

మురళీధర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానం

ప్రజావాణి – నర్సాపూర్, అక్టోబర్ 29:

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం నర్సాపూర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగా, పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్‌తో పాటు నాగులు, రత్నం, నరేష్, కుమార్, లక్ష్మణ్, రాజు, రాము, జావిద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.