సిపిఎం నేత సామినేని రామారావు హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోరెన్సిక్ ఆధారాలతోదర్యాప్తు
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావు. వయస్సు 72 సంవత్సరాలు, 31.10.2025 తేదీన తెల్లవారుజామున తన ఇంటి పక్కన ఉన్న కొట్టంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చింతకాని పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్. 324/2025, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) మరియు సెక్షన్ 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ సైన్స బృందం సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులకు సంబంధించినవిగా అనుమానిస్తున్న చెప్పులు మరియు కాలి ముద్రలు, ఎరుపు రంగు వస్త్రపు ముక్క, తెలుపు రంగుపై నల్లని గీతలు ఉన్న వస్త్రపు ముక్క, కత్తి కవర్లో పాటు ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, సంఘటనా స్థల పరిస్థితులు మరియు సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలించారు.
సాంకేతిక ఆధారాల విశ్లేషణ
నిందితులను గుర్తించేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా, ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులు, సాక్షులు మరియు ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ఆధారంగా గుర్తించిన మొత్తం 24 మంది వ్యక్తులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు ఖమ్మంలోని గౌరవనీయ III అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును అనుమతి కోరారు, కోర్టు సమన్లు అందుకున్న వారిలో ఆరుగురు అనుమానితులు స్వచ్ఛందంగా పరీక్షలకు సమ్మతి తెలిపారు. తదనుగుణంగా, 2026 జనవరి నెలలో కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలను దర్యాప్తులో సేకరించిన ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించగా, కొన్ని సంబంధిత ఆధారాలు లభించాయి.
దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్ లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నిపుణుల సహాయం కోరారు. ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఖమ్మంకు వచ్చి ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించింది. ఈ విశ్లేషణ ద్వారా లభించిన సమాచారాన్ని కేసులో అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించారు.
నలుగురు నిందితుల అరెస్ట్
దర్యాప్తులో సేకరించిన భౌతిక మరియు సాంకేతిక ఆధారాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ అయిన నిందితులు ఖమ్మం రూరల్ మండలం తెల్లారుపల్లి గ్రామానికి చెందినవారు. అరెస్ట్ అయినవారిలో బోడ పట్ల
శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను వయసు 34 సంవత్సరాలు నూకల లింగయ్య వయసు 43 సంవత్సరాలు మల్లారపు లక్ష్మయ్య వయస్సు 24 కార్లపూడి ఉదయ్ కుమార్ అలియాస్ రుక్మన్ కుమార్ వయసు 39 సంవత్సరాలు నిందితులు వద్దనుండి రెండు కత్తులు రెక్కీ నిర్వహించే సమయంలో ఉపయోగించినట్లుగా ఆరోపణలు ఉన్న నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈ దర్యాప్తు బృందంలో
వీరేందర్ జి. నరేష్. సబ్ ఇన్స్పెక్టర్లు ఆఫ్ పోలిస్ సహాయ దర్యాప్తు అధికారులు, దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన వైరాఏసిపి ఎస్. సారంగపాణి, వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. వెంకట ప్రసాద్ మరియు బృందంలోని ఇతర అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.


