📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోక్సో చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

పోక్సో చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

📰 Generate e-Paper Clip

పోక్సో చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీందర్

పెద్దపహాడ్ జడ్పీహెచ్ఎస్ లో బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కింద పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఆదేశానుసారం, సంస్థ కార్యదర్శి శంకర శ్రీదేవి సూచనల మేరకు గురువారం జిల్లా పరిషత్ హై స్కూల్, పెద్దపహాడ్ నందు బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ (Protection of Children from Sexual Offences Act) – పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జనగామ అడ్వకేట్ మంచాల రవీందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఆదేశానుసారం ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు పోక్సో చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.

ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల లోపు బాలలను లైంగిక వేధింపుల నుండి రక్షించడం అని తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాలికలు, బాలురు వివాహం చేసుకోరాదని, శారీరక సంబంధాలు పెట్టుకోరాదని గుర్తు చేశారు. పోక్సో చట్టం చాలా కఠినమైనదని, ఈ నేరం కింద ఎవరూ తప్పించుకోలేరని, తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనని, శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఈ నేరానికి పాల్పడిన వారికి ఒక్కోసారి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని, బాధితులకు రక్షణ కల్పించడానికి, సత్వర న్యాయం అందించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా స్నేహితులకు, టీచర్లకు, తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఒకవేళ సమస్య ఇంట్లోనే లేదా స్కూల్లోనే ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని, మీ సమస్యను తెలియజేస్తే మీకు పూర్తి రక్షణ, న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ఇంచార్జి హెచ్ఎం పి. మల్లారెడ్డి, పారా లీగల్ వాలంటీర్లు బి. శేఖర్, పి. జితేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.