📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పరిశుభ్రతకు పాతర: ఇది పోరుమామిళ్ల మండల పరిషత్ ఆఫీసా? లేక చెత్తకుండీనా? ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు!

పరిశుభ్రతకు పాతర: ఇది పోరుమామిళ్ల మండల పరిషత్ ఆఫీసా? లేక చెత్తకుండీనా? ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (కడప జిల్లా):అక్టోబర్ 29 ప్రజావాణి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యాలయమే ఇప్పుడు అపరిశుభ్రతకు నిలయంగా మారింది.కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయం గుమ్మం ముందే ప్రభుత్వ ఉద్యోగులు బస చేసినట్లు,తిన్న ఇస్తరాకులను పారేసి కార్యాలయ ఆవరణను ఒక చెత్తకుండీలా మార్చడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.ఇది మండల పరిషత్ ఆఫీసా?లేక చెత్తకుండీనా?”అంటూ కార్యాలయానికి వచ్చే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

గుమ్మం ముందే తిండి.. అక్కడే విస్తళ్ల పారేవేత!

మండల పరిధిలోని ప్రజల సమస్యలను తీర్చడానికి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రణాళికలు రచించాల్సిన ఎంపీడీవో ఆఫీసులోనే నిబంధనలు గాల్లో కలిసిపోయాయి. కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మధ్యాహ్నం వేళల్లో ఆఫీస్ గుమ్మం ముందే అన్నాలు తిని,ఆ తిన్న ఇస్తరాకులను,ఎంగిలి వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేయకుండా ఏకంగా వాకిలి ముందే పారేయడం గమనార్హం.రోజురోజుకూ పేరుకుపోతున్న ఈ ఎంగిలి విస్తళ్లు, వ్యర్థాల వల్ల ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఈ దృశ్యాలను చూసి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.”గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని,చెత్తను రోడ్లపై వేయవద్దని మాకు సుద్దులు చెప్పే అధికారులు.వారి సొంత ఆఫీసులోనే ఇలా ప్రవర్తించడం ఏంటని?“ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు నివసించే, పనిచేసే చోట కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా అని ప్రజల మధ్య పెద్ద ఎత్తున గుసగుసలు,చర్చలు సాగుతున్నాయి.పరిశుభ్రత అనేది కేవలం సామాన్య ప్రజలకేనా, పెద్ద పెద్ద జీతాలు తీసుకునే మండల ఆఫీస్ ఉద్యోగులకు వర్తించదా అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్వచ్ఛ భారత్,పరిశుభ్రత అంటూ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే,ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో అధికారులు ఆ సూత్రాలను తుంగలో తొక్కుతున్నారు.ఆఫీస్ గుమ్మం దగ్గరే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,పోరుమామిళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అపరిశుభ్ర వాతావరణానికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని,కార్యాలయ ఆవరణను శుభ్రంగా ఉంచేలా చూడాలని స్థానిక ప్రజలు,సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.