📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅర్హులైన పేదలకు ఇళ్లు అందేలా సహకరించండి

అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా సహకరించండి

📰 Generate e-Paper Clip

అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా సహకరించండి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీపీఐ నేత రాజారెడ్డి విజ్ఞప్తి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): జనగామ పట్టణంలో ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకొని సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కోరారు.

గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజారెడ్డి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
జనగామ పట్టణంలో ఎంతో మంది అర్హులైన పేదలు సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని అధికారులు గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిజమైన అర్హులకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.

సీపీఐ నేతల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన పేదల ఇళ్ల సమస్యను తాను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, వారికి ఇళ్లు మంజూరయ్యేలా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సోమయ్య, నాయకులు శ్రీశైలం, ఐలయ్య, వెంకటాద్రి, సరిత, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.