📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి!

కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

మూడు గంటల పాటు మార్చురీ ఎదుట బాధిత కుటుంబంతో కలిసి ఆందోళన.. విచారణ జరిపించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ

ప్రజావాణి
అక్టోబర్ 29:

తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని దావులగళ్ల లాస్య అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలను నిష్పక్షపాతంగా వెలికితీసి, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో లాస్య మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, సంతోష్‌లను పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అనంతరం బాధిత కుటుంబంతో కలిసి సుమారు మూడు గంటల పాటు మార్చురీ ఎదుట ఆందోళనలో పాల్గొని, లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రాత్రి 10 గంటల వరకు బాగానే ఉన్న విద్యార్థిని తెల్లవారుజామున 5 గంటలకల్లా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షేమ గురుకులాలు ఎంతో కీలకమని, అలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, కనీస వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ప్రహరీ గోడలు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం.విద్యార్థిని లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.దీనిపై కలెక్టర్ హేమావతి స్పందిస్తూ, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని, లాస్య మృతి ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.