*సహజ ఎరువులను ఉపయోగించి భూసారాన్ని పెంచండి – ఎఓ మల్లేష్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
గురువారం చండూరు మండలం, దోనిపాముల గ్రామంలో జరిగిన ‘ఖేతీ బచావో అభియాన్’ & పంటల వైవిధ్యీకరణ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి పి మల్లేష్ హాజరైనారు. తక్కువ రసాయన ఎరువులు & పురుగుమందులు వాడి భూసారాన్ని & ప్రకృతిని సంరక్షించాలని కోరారు. ఎల్ నినో పరిస్థితుల గురించి వివరించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు & నూనెగింజల పంటలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ ఇంకా కొంతమంది వారు వెంటనే సంబంధిత ఎ.ఈ.ఒ.ని కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ యొక్క ఐడి భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ అయినా ప్రామాణికంగా తీసుకుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి పద్మజ, మాజీ సర్పంచ్ పి. యాదయ్య, జి. రామస్వామి, ఎస్. లింగస్వామి, ఇతర రైతులు పాల్గొన్నారు.

