📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమా సమస్యలపై పోరాడే ఎమ్మెల్సీకే మా మద్దతు

మా సమస్యలపై పోరాడే ఎమ్మెల్సీకే మా మద్దతు

📰 Generate e-Paper Clip

*మా సమస్యలపై పోరాడే ఎమ్మెల్సీకే మా మద్దతు…*

*కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కోశాధికారి & భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవి కుమార్*

భద్రాద్రి జిల్లా బ్యూరో, అక్టోబర్ 29 (మన ప్రజావాణి): పట్టభద్రుల ఎమ్మెల్సీ (ఖమ్మం -వరంగల్-నల్గొండ) ఎన్నికల్లో గెలుపును నిర్ధారించేది ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులదేనని కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కోశాధికారి & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవి కుమార్ అన్నారు. గత టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలుపుకు ప్రధాన పాత్ర పోషించిన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులని, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో దాదాపుగా 800 మంది టీచర్స్ ఉన్నారు. గతములో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన పల్ల రాజేశ్వర్ రెడ్డిని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో కూడా మా మద్దతు తెలిపి గెలిపించడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో మాకు అనేక హామీలు ఇచ్చి, ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి, మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకొని తిరిగి మాకు ఎవరు పట్టించుకోలేదు. ఈసారి త్రిముఖ గట్టిపోటీ మా గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల పాత్ర 800 మంది కాకుండానే మా కుటుంబ సభ్యులతో కలిపి దాదాపుగా 3000 పైచిలుకు ఓట్లు ఉన్నాయని, ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ గ్రాట్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు ప్రధాన పాత్ర పోషిస్తాము. ఈసారి ఎవరైతే మా యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల ముందే పరిష్కారానికి కృషి చేస్తారో వారికి ఈసారి మా పూర్తి మద్దతు తెలియజేస్తామని పత్రిక ముఖంగా తెలుపుతున్నామని రవి కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.