*రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు* .
*తెలుగు రాష్ట్రాలలో మొత్తం 29 నేరాలకు పాల్పడిన ముఠా సబ్యులు*
*వారివద్దనుండి, 30 లక్షల విలువగల (02) కార్లు, (20) లక్షల నగదు, కాపర్ వైర్, 2 కట్టర్లు, 4 పానాలు, హాండ్ గ్లౌసెస్, (3) మొబైల్ మొబైల్ ఫోన్లు స్వాధీనం*
*100% రికవరీతో రైతులకు భరోసా కల్పించిన పోలీసులు*
– *జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
ఇటీవల కాలంలో జిల్లా లోని పలు ప్రాంతాలలో వరుసగా వ్యవసాయ విధ్యుత్, కర్మాగార ట్రాన్స్ఫోర్మర్ కాపర్, ఆయిల్ మరియు వివిధ ట్రాన్స్ఫోర్మర్ భాగాలను దొంగలిస్తూ రైతులను మరియు సాధారణ ప్రజాజీవనానికి తీవ్ర ఇబ్బంది పెడుతున్న దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మిర్యాలగుడ డిఎస్పి జి. రవిగారి ఆద్వర్యంలో, నల్ల్గొండ సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మిర్యాల్గూడ II టౌన్ ఇన్స్పెక్టర్ జె. సోమనార్సైయ్య , మిర్యాల్గూడ రూరల్ సర్కల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ వి. సురేశ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి ప్రతెక బృందాలు రాష్ట్రం లోని వివిద ప్రదేశాలలో దర్యాప్తు జరిపి సాంకేతిక పరిజ్ఞానం తో ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న బృందాన్ని గుర్తించడం జరిగింది. ఇట్టి ముఠా పై నిఘా ఉంచిన ప్రతెక బృందాలు ముఠా లోని నలుగురు సబ్బ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
*కేసు వివరాలు* :
వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ: 22-08-2026 రోజు ధనవత్ పాండు నాయక్, తండ్రి: సక్రు నాయక్, వయస్సు: 45 సంవత్సరాలు, వృత్తి: అసిస్టంట్ ఎక్ష్హికుటివ్ ఇంజినీర్, అను అతను నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పై ఉ ఉన్న L-15 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు చెందిన 500 కేవిఏ ట్రాన్స్ఫోర్మర్ లోని (300) కిలోల కాపర్ మరియు 250 లీటర్ల ఆయిల్ దొంగలించబడినది అని వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వేములపల్లి ఎస్ఐ నమోదు చేసిన Cr.No.198/2026 U/s 303(2) BNS కేసుకు సంబంధించి, జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
*వాహన తనిఖిలలో ముఠా గుట్టు రట్టు:*
ఈ క్రమంలో తేదీ 28-10-2026 మద్యానం 01 గంటలకు వేములపల్లి గ్రామ శివారులోని సూర్యపేట x రోడ్ వద్ద వేములపల్లి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఎర్టీగా కార్ లో అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి కారును తనిఖీ చేయాగ అందులో ని ఒక వ్యక్తిని Cr.No. 09/2026 of వేములపల్లి కేసులో ట్రాన్స్ఫోర్మర్ తెఫ్ట్ కేసులో నిందితుడైన పాతనేరస్థుడైన చంద్ పాషా గా గుర్తించడం జరిగినది. తదుపరి కార్లోని మిగిలిన ఇద్దరినీ కూడా విచారించగ వీరు కూడా ట్రాస్ఫోర్మర్ లనుండి కాపర్ ను దొంగలించే పాత నేరస్తులని గుర్తించడం జరిగినది. కారుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో, కారును తనిఖీ చేయగా కార్లో పానాలు, కట్టర్, గ్లౌసులు లభించడం వలన వారిని అదుపులోనికి తీసుకొని విచారించగా, తాము గతంలో చాలా చోట్ల ట్రాన్స్ఫోర్మర్ నుండి కాపర్ మరియు ఇతర సామాను ను దొంగలించమని వాటిని హయత్నగర్ లో గల పాత సామాను వ్యాపారులు అయిన దేశిరామ్ కు అమ్మినాము అని, దానికి సంబందించిన డబ్బులను ఇవ్వడానికి మరియు మావద్దనున్న మరికొంత ట్రాన్స్ఫోర్మర్ కాపర్ ను కొనడానికి అతను రాజీవ్ నగర్, మిర్యాలగూడ వద్ద నున్న చంద్ పాషా యొక్క ఇంటికి వచ్చారని చెప్పగా అతనిని కూడా చంద్పాషా ఇంటివద్ద అదుపులోని తీసుకొని వారి వద్దనుండి డబ్బులు, కాపర్ ను మరియు సఫారి కారును స్వాదిన పరుచుకున్నారు.
*పట్టుబడిన నిందితుల వివరాలు*
1.షేక్ చంద్ పాషా, తండ్రి: షేక్ ఇబ్రహీం, వయస్సు: 26 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, శాశ్వత చిరునామా:
ఇంటి నంబర్. 303, రాజీవ్ నగర్, మిర్యాలగూడ. ప్రస్తుత చిరునామా: కుంట్లూర్ రోడ్, హయాత్ నగర్.
2.రామావత్ సూర్య, తండ్రి: రెడ్యా, వయస్సు: 19 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, శాశ్వత చిరునామా:
పడమటి తండా, పి.ఎ. పల్లి, నల్గొండ.. ప్రస్తుత చిరునామా: ఇంజాపూర్, భవానోలి కాలనీ, హైదరాబాద్.
3.గలబ సాయి కిరణ్, తండ్రి: కలబ సుబ్బారావు, వయస్సు: 19 సంవత్సరాలు, వృత్తి: కూలీ (లేబర్), శాశ్వత
చిరునామా: సాబునగర్, మిర్యాలగూడ. ప్రస్తుత చిరునామా: అబ్దుల్లాపూర్మెట్, హైదరాబాద్.
4. ఇస్లావత్ దేశిరామ్ తండ్రి: శ్రీను వయస్సు : 24 సంవత్సరాలు ఇంటి నంబర్ 8-7-93, కస్తూరి కాలనీ, హస్తినాపురం, హైదరాబాద్ (రిసీవర్ )
పట్టుబడిన నిందితులు గతంలో కూడా తెలుగు రెష్ట్రాలలో (25 ) నేరాలలో నింధితులు.
ముఠా లోని మిగితా (5) సబ్యులు పరారీలో ఉన్నారు వారి వివరాలు:
1. సంతోష్ 2. నాన్కు , 3. మోడల్ సాయి 4. ప్రియా 5. సునీత.
నేరాలకు పాల్పడిన విధానం:
జల్సాలకు అవవాటుపడి చెడు వ్యసనలకు బానిసలుగా మారి వారు రోజువారీ పనులు చేయగా వచ్చిన డబ్బులువారి కుటుంబ అవసరాలకు మరియు వారి జల్సాలకు సరిపోకపోవడంతో, వారందరు కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని, ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ మెటీరియల్, ఆయిల్ మరియు అల్యూమినియం వైర్లను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారందరు ముఠాలుగా యేర్పడి వివిధ కార్లలో, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రాత్రి సమయంలో వారి ముఠా లోని మహిళలతో కార్లలో వెళ్లి, పానాలు, కట్టర్ల సహాయంతో ట్రాన్స్ఫార్మర్లను కట్ చేసి వాటిలోని ఆయిల్, కాపర్ వైర్ మరియు సంబంధిత వస్తువులను దొంగిలించి వాటిని హయత్నగర్ లో గల పాత సామాను వ్యాపారులు అయిన దేశిరామ్, లకు అమ్మి వచ్చిన డబ్బులను అందరు సమానంగా పంచుకుని వాటిని వారి కుటుంబ అవసరాలకు మరియు జల్సాలకు వినియోగించేవారు. నేరాలకు పాల్పడటానికి వెళ్తున్నప్పుడు పోలీసు వారు యెవరైనా పట్టుకుంటారు అని యెవరికి అనుమానం రాకుండా ఇట్టి ముఠా సబ్యులు వీరితో పాటు నకిలీ నంబర్ ప్లేట్ కార్లో వారి బృందాలలోని మహిళలను కూడా తమతో పాటు వాహనం లో తెసుకెళ్ళేవారు.
విచారణలో బయటపడిన కేసులు:-
మొత్తం తెలుగు రాష్ట్రాలలో (29) నేరాలకు పాల్పడిన నేరస్తులు.
1. తెలంగాణా రాష్ట్రం పరిధిలో (25) నేరాలు,
ఎ. నల్గొండ జిల్లానందు 18 నేరాలు చేసినారు.
1. వేములపల్లి 2. వాడపల్లి 3. మాడ్గులపల్లి 4. అడవిదేవులపల్లి 5. మిర్యాలగూడ (MLG) II టౌన్ 6. తిరుమలగిరి సాగర్, 7. హాలియా 8. త్రిపురారం 9. కనగల్ 10. చింతపల్లి 11.నేరెడుగొమ్ము 12. . దేవరకొండ పి ఎస్ పరిధిలో పాటు
బి. ఇతర జిల్లాలలో (07) నేరాలు
13. తూప్రాన్ 14. చౌటుప్పల్ 15.చౌటుప్పల్ 16.అబ్దుల్లాపూర్మెట్ 17.మనోహరాబాద్ పోలీసు స్టేషన్ ల పరిధిలోని వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడినారు.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో (4) నేరాలు
1.పల్నాడు 2. మాచవరం 3. దాచేపల్లి పోలీసు స్టేషన్ ల పరిధిలో (4) చోట్ల
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
రూ.20 లక్షల నగదు మరియు 30 లక్షల విలువ గల రెండు విలువైన కార్లు, నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నందు ప్రవేశపట్టబడును. ఈ కేసును డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో సమర్థవంతంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో మరియు 100 % రికవరీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మిర్యాల్గూడ II టౌన్ ఇన్స్పెక్టర్ సోమనార్సైయ్య, మిర్యాల్గూడ రూరల్ సర్కల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్ ఎస్ఐలు యు సురేశ్, వి. సురేశ్ రెడ్డి సిసిఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుళ్లు అస్రార్, సమద్, సాయి, శివర్రాజు, నారేష్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్ ప్రకటించనైనది.

