*రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 కు ఎంపికైన నల్గొండ జిల్లా బృందం*
*అభినందించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్*
రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 నల్గొండ జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం గా రాష్ట్రీయ ఏక్తా దివస్ 2026 వేడుకల్లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించనున్నారు. అక్కడ జరిగే రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నల్గొండ జిల్లా నుంచి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పదిహేను మంది ఎంపిక కాగా మరో ఇద్దరిని స్పెషల్ ఇన్వైటీస్ గా ఎంపిక చేశారు. నర్సింగ్ కోటయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నల్గొండ నుంచి, ఆవుల సుందరాల చినకాపర్తి నల్గొండ నుంచి ఎంపికయ్యారు. వీరు 31- 10- 2026 న గుజరాత్ లోని కేవడియా, ఏక్తా నగర్ లో జరిగే రాష్ట్రీయ ఏక్తా దివస్ కు ప్రత్యేక ఆహ్వానితులుగా (స్పెషల్ ఇన్విటీస్ గా) హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైనటువంటి వీరిని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్, నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అభినందించారు.

