*మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి*
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ , ఏర్పుల చంద్రయ్య, బి ఎన్ జ్ఞానేశ్వర్, మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మంచాల మండలం లేక పోవడం దురదృష్టకరం,
ప్రభుత్వం కరువు మండలాల జాబితాలో నగర శివారు మండలాలు గండిపేట,రాజేంద్రనగర్,సరూర్ నగర్,అబ్దుల్లాపూర్ ,బాలాపూర్ మరియు మహేశ్వరం లాంటి వ్యవసాయం చేయని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించి ,తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న అత్యంత వెనుకబడిన,ప్రధానంగా వ్యవసాయాధారిత/ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని మంచాల మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించక పోవడాన్ని BRS పార్టీ తీవ్రంగా ఖండించింది
ఇట్టి విషయాన్ని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం,సంభరిత రెవిన్యూ ,వ్యవసాయాధికారులు స్థానిక రైతులు,ప్రజాప్రతినిధులతో చర్చించి సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని,వెంటనే మంచాల మండలాన్నీ కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు
స్థానిక MLA గారు నిర్లక్ష్యాన్ని వీడి సమయోచితంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి,సత్వరమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు
మండలానికి అనేక రకాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ స్థానిక MRO గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మండలాన్ని వెంటనే కరువు మండలముగా ప్రకటించాలని మరొక్కసారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో బుస్సు పుల్లారెడ్డి,జంగారెడ్డి,రఘుతి, బద్రీనాథ్ గుప్తా గంట విజయ్ ప్రకాష్ రెడ్డి,బొడ్డు నాగరాజు,పుడుతల నాగరాజు,నోముల బాలరాజు,కరుణాకర్ రెడ్డి,పున్నంరాము,మల్లప్ప,నారీ యాదయ్య,ఆకారం కృష్ణ,హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

