📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన

ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన

📰 Generate e-Paper Clip

ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన

గుగ్గిళ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో కార్యక్రమం

బెజ్జంకి,అక్టోబర్ 28 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆర్థిక సమ్మిళితంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు బెజ్జంకి శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. పథకాల ప్రయోజనాలు, అర్హతలు, నమోదు విధానం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక భద్రత పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీఎస్ఏ సుమంత్, గుగ్గిళ్ల సర్పంచ్ మల్లయ్య, గ్రామ కార్యదర్శి వంశీ, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ మహేష్, ఎఫ్ఏ, సీఎస్పీ ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.