📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనూతన ఎస్‌ఐ నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

నూతన ఎస్‌ఐ నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ | వేలేరు మండలం

**నూతన ఎస్‌ఐ నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు**

వేలేరు, అక్టోబర్ 28: వేలేరు మండలానికి నూతనంగా బదిలీపై వచ్చి విధుల్లో చేరిన ఎస్‌ఐ దూది మెట్ల నరేశ్‌ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బొజ్జ రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేశ్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.