📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహిళా పోలీస్ సిబ్బంది లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ

మహిళా పోలీస్ సిబ్బంది లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ

📰 Generate e-Paper Clip

*మహిళా పోలీస్ సిబ్బంది లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* .

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు UMEED స్వచ్ఛంద సంస్థ సహకారంతో TGPA ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖకు ప్రజలే ప్రధానమని, సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించడం పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు.ముఖ్యంగా మహిళలు, బాలికలు, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను ఓపికగా వినాలని, వారితో గౌరవప్రదంగా, సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. బాధితులు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా తెలియజేసేలా పోలీస్ స్టేషన్లలో నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడంతో పాటు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, క్లిష్ట పరిస్థితుల్లో సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భావోద్వేగ నియంత్రణ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పోలీస్ విధుల్లో ఎంతో కీలకమని తెలిపారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో ఆచరణలో పెట్టి, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది కేవలం చట్టాన్ని అమలు చేసే సిబ్బందిగానే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే నాయకులుగా, బాధితుల్లో ధైర్యాన్ని నింపే వ్యక్తులుగా ఎదగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో సున్నితత్వంతో స్పందిస్తూ, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను మహిళా పోలీస్ సిబ్బంది తమ విధి నిర్వహణకే పరిమితం చేయకుండా, తమ తమ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ సూచించారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలు బాధితులతో సానుభూతితో వ్యవహరించే విధానాలను సహచర సిబ్బందితో పంచుకోవాలని, తద్వారా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి బాధితుడికి మెరుగైన సేవలు అందిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, TGPA డిఎస్పీ శ్రీనివాస రావు, Umeed ఎన్.జి.ఓ సభ్యులు రహమ్మత్ ఉన్నిసా, నందిని, కౌశికి శర్మ, హనిత, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ మంజుల,ఏ.ఎచ్.టి.యు ఎస్.ఐ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.