📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకెనాల్ పూడికతీత అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

కెనాల్ పూడికతీత అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

📰 Generate e-Paper Clip

కెనాల్ పూడికతీత అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం..

రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: ఎమ్మెల్యే డా.మురళి నాయక్

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం-48 మైనర్ కాలువపై రూ.23 లక్షల నిధులతో చేపట్టనున్న పూడికతీత,అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ ప్రారంభించారు. సుమారు 37 కిలోమీటర్ల పొడవున కాలువలో పెరిగిన చెట్ల తొలగింపు, పూడికతీత పనులను చేపట్టనున్నారు.

ఈ పనుల ద్వారా కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగి, సాగునీరు సక్రమంగా ప్రవహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కాలువ నిర్వహణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పద్మ సత్యపాల్ రెడ్డి, రామ్ సింగ్, గోగుల మమతా ప్రశాంత్, భాస్కర్ నెల్లికుదురు ఇనుగుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి,బైరు అశోక్ గౌడ్, జిల్లా నేత బాలాజీ నాయక్, జిల్లా మండల నాయకులు ఇరిగేషన్ అధికారులు వివిధ గ్రామాల ఉప సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.