కెనాల్ పూడికతీత అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
కెనాల్ పూడికతీత అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం.. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: ఎమ్మెల్యే డా.మురళి నాయక్ ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం-48 మైనర్ కాలువపై రూ.23 లక్షల నిధులతో చేపట్టనున్న పూడికతీత,అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ ప్రారంభించారు. సుమారు 37 కిలోమీటర్ల పొడవున కాలువలో పెరిగిన చెట్ల తొలగింపు, పూడికతీత పనులను చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగి, సాగునీరు సక్రమంగా ప్రవహించేందుకు అవకాశం...