*వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం…*
*ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26*
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలలోని పిలాయిపల్లి , జగత్‌పల్లి గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను
భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజకు తగిన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించ కుండా , ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని కోరారు. రైతు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో పోచంపల్లి , జూలూరు పిఎసిఎస్ చైర్మన్లు పాక మల్లేష్ యాదవ్ , కళ్లెం రాఘవరెడ్డి , స్థానిక సర్పంచులు మహాలక్ష్మి -దానయ్య , గీతా మహేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామా మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి , అంబరీష్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పునూతల వెంకటేష్ , పిఎసిఎస్ వైస్ చైర్మన్లు , డైరెక్టర్లు , సంబంధిత శాఖల అధికారులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.

