📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి

గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి

📰 Generate e-Paper Clip

గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి

• గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు కమాన్ల నిర్మాణానికి శ్రీకారం.. గురునానక్ మందిర్‌లో ప్రత్యేక ప్రార్థనలు

మన ప్రజావాణి అక్టోబర్ 26 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి

గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో గురునానక్ మందిర్‌కు సంబంధించిన రెండు కమాన్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. గురునానక్ మందిర్‌కు వెళ్లే ప్రవేశ మార్గంలో ఒకటి, మందిర్ సమీపంలోని భవాని మందిర్ రోడ్డులో మరొక కమాన్ నిర్మించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు.

అంతకుముందు గురునానక్ మందిర్‌ను సందర్శించిన జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర్ ప్రతినిధులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం మందిర్ ప్రాంగణంలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు జగ్గారెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను యథాస్థానంలోనే ఉంచి అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిక్కు ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్‌పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.