📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం

భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం*

*మహబూబాబాద్ జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 26. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని భూపతి పేట రైతుల్లో పంటల వైవిధ్యీకరణ, ఎల్‌నినో ప్రభావాలు, పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు భూపతిపేట రైతు వేదికలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, పంటలపై వాటి ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. పంటల వైవిధ్యీకరణ ప్రాముఖ్యతను వివరిస్తూ, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు మరియు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంటల మార్పిడి ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే పంట కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు నేల సారం తగ్గుతుందని, వాయు కాలుష్యం పెరుగుతుందని వివరించారు. పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుల తయారీకి, నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించేందుకు వినియోగించాలని రైతులకు సూచించారు. రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే పద్ధతులను అనుసరించాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు (ఆర్), మహబూబాబాద్ అజ్మీరా శ్రీనివాస్ గారు, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్, ఉద్యానవన అధికారి శాంతి ప్రియ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి
చందన, భూపతిపేట, వెంగంపేట గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.