📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి....సనాతన ధర్మం, హిందూ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి….సనాతన ధర్మం, హిందూ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

బోడుప్పల్ అక్టోబర్ 24 (ప్రజావాణి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ (ధార్మిక) సెల్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు, మధుర శ్రీ కృష్ణ జన్మభూమి న్యాస్ అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ఇన్‌చార్జి శ్రీ అమర్‌నాథ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ మాట్లాడుతూ సనాతన ధర్మం విశిష్టత, హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక విలువల గురించి వివరించారు. ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.

అనంతరం అమర్‌నాథ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు పరిశీలన అనంతరం ఓటరు జాబితాలో తమ పేరు నమోదైందో లేదో సరిచూసుకోవాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అన్నవజ్జుల సూర్య ప్రకాష్, రాష్ట్ర కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్, మేడ్చల్ రూరల్ జిల్లా కన్వీనర్ ఆదిమూలం కరుణాకర్, కో-కన్వీనర్లు నాంపల్లి అశోక్, నవ్య రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ కో-కన్వీనర్ నోముల విశ్వేశ్వరరావు, బోడుప్పల్ డివిజన్ కో-కన్వీనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.