పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి….సనాతన ధర్మం, హిందూ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

బోడుప్పల్ అక్టోబర్ 24 (ప్రజావాణి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ (ధార్మిక) సెల్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు, మధుర శ్రీ కృష్ణ జన్మభూమి న్యాస్ అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ఇన్‌చార్జి శ్రీ అమర్‌నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహంత్ నృత్య గోపాల్ దాస్...