📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక

📰 Generate e-Paper Clip

*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నిక*

*: మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ని కలిసిన ఇద్దరు ఎంపీటీసీలు.. ఎంపీటీసీలకి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*

అనంతపురం అక్టోబర్ 24 ప్రజావాణి ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్వగ్రామం అయిన పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల గ్రామాల్లో ఎంపీటీసీలుగా పోటీ చేసిన ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు ఎంపీటీసీలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలియజేసి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభంజనం విస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.