రైతుల పొలాలకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
125 రోజుల వి.బి.జి. రామ్ పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణం
బెజ్జంకి, అక్టోబర్ 24 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ నుంచి దాచారం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 125 రోజుల వి.బి.జి. రామ్ పనుల్లో భాగంగా ఈ నిర్మాణ పనులు చేపట్టారు.
రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రాకపోకలు సులభతరం కానున్నాయి. వ్యవసాయ పనుల సమయంలో ఎదురయ్యే రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు, పంటల సాగు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడనుంది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, సర్పంచ్ గాజ రవళి శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

