📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల పోలీస్‌స్టేషన్‌లో యువతకు అవగాహన కార్యక్రమం

మంచాల పోలీస్‌స్టేషన్‌లో యువతకు అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*మంచాల పోలీస్‌స్టేషన్‌లో యువతకు అవగాహన కార్యక్రమం*

*ఆన్‌లైన్‌ ఆటలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: పోలీసుల సూచన*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల, అక్టోబర్ 22 (ప్రజావాణి):

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచాల పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం యువతకు అవగాహన కల్పించేందుకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ మధు, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, వంశీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు యువతకు పోలీసుల విధులు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ గురించి వివరించారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు చేపట్టే విచారణ, ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు, విచారణ నిమిత్తం సంబంధిత వ్యక్తులను పిలిపించడం, కేసులను న్యాయస్థానాలకు పంపించే విధానం గురించి అవగాహన కల్పించారు.

గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.

యువత ఆన్‌లైన్‌ ఆటలకు బానిసలు కాకుండా చదువు, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి, వాటి విక్రయాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు దెబ్బతినడమే కాకుండా, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, చరణ్. మిట్టు టిల్లు గ్రామ యువత, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.