📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబొక్కోనిగూడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి

బొక్కోనిగూడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 17 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ బొక్కోనిగూడలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఘట్‌కేసర్ మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని పంచుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగాల నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలతో కలిసి బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ ఆడటంతో వేడుకల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా ఆమె మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

కాలనీవాసులు, మహిళలు కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించడంతో బొక్కోనిగూడలో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.