బొక్కోనిగూడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 17 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ బొక్కోనిగూడలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఘట్‌కేసర్ మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగాల నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలతో కలిసి...