గురువాయిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు
కూసుమంచి అక్టోబర్ 17, ప్రజావాణి:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పందిరి సంపత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్టియా కుషా, వార్డు సభ్యులు నాగిరెడ్డి, పద్మతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.
గురువాయిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
RELATED ARTICLES
