గురువాయిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

గురువాయిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు కూసుమంచి అక్టోబర్ 17, ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద...