ఉన్నత విద్యావంతుడు బి. సి రమేష్ గౌడ్ కు వైసిపి పెద్దపీట
22 సంవత్సరాల నుంచి
ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న రమేష్ గౌడ్
రాష్ట్ర వైసిపి బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్న యువనేత కు ,మేయర్ అభ్యర్థిగా కన్ఫామ్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి,
జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి, నరేష్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బి సి రమేష్ గౌడ్
అనంత పురం బ్యూరో అక్టోబర్ 17 ప్రజా వాణి
ఉన్నత విద్యావంతుడు యువ నాయకుడు బిసి రమేష్ గౌడ్ కు వైసిపి పార్టీ పెద్దపీట వేశారు. 22 సంవత్సరాలుగా ప్రజా సమస్యల కోసం రమేష్ గౌడ్ నిత్యం
పోరాటం చేస్తున్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులకు లీడర్ గా ఉంటూ , యువ సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
.ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజలకు రమేష్ గౌడ్ అండగా నిలిచారు. వైసిపి ఆవిర్భావం నుంచి రమేష్ గౌడ్ వైసిపి పార్టీ అభ్యున్నతికి కోసం పనిచేస్తున్న సమయంలో రమేష్ గౌడు కు వైసిపి పార్టీ అధిష్టానం రాష్ట్ర బిసి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. దీంతో ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి నేటి వరకు వైసిపి పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీ ప్రతిపక్షం లో ఉన్న సమయం లో ఎన్నో ధర్నాలు ,ఆందోళనలు చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైసిపి అధిష్టానం రమేష్ గౌడ్ కు ఖరారు చేసింది.ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి, అనంతపురం వైసిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కి నరేష్ కుమార్ రెడ్డి లకు మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తో పాటు 62 డివిజన్లో వైసిపి జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. అనంతపురం నగర అభివృద్ధి వైసిపి ప్రభుత్వం లోనే జరిగిందని అనంతపురం సిటీ అభివృద్ధికి 1000 కోట్ల
నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న నగరంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు
జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నగరంలో ఎన్నో రహదారుల లలో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు. అనంతపురం పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్డు వరకు బైపాస్ లైన్ వేయడంతో పాటు టవర్ క్లాక్ వద్ద బ్రిడ్జిని నిర్మించడం జరిగిందన్నారు. ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని వైసిపి పార్టీ కైవసం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.

