📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNHM ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె

NHM ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె

📰 Generate e-Paper Clip

NHM ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె

వరంగల్: NHM JAC తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 78 క్యాడర్లకు చెందిన సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వేతన భద్రత కల్పించాలని, ఇతర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

NHM ఉద్యోగులు ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమకు తగిన ఉద్యోగ భద్రత, వేతన ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరవధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు.

NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:

1. NHM ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలి.
2. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి NHM క్యాడర్‌కు పే ఫిక్సేషన్ చేసి, 100 శాతం గ్రాస్ జీతాలు అందించాలి.
3. ముందస్తు సమాచారం, సమ్మతి లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేసే విధానాన్ని పునఃసమీక్షించి, జీవో 1195ను పునఃపరిశీలించాలి.
4. NHM ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ (SHS) పరిధిలోకి తీసుకువచ్చి, సర్వీస్ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలి.
5. NHM సిబ్బంది జీతాలను ప్రతి నెలా 5వ తేదీలోపు సకాలంలో చెల్లించాలి.
6. ప్రతి NHM ఉద్యోగికి ఏటా 5 శాతం ఇంక్రిమెంట్‌తో పాటు, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 8 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మంజూరు చేయాలి.
7. ప్రతి మహిళా NHM ఉద్యోగికి క్యాడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
8. ఏదైనా NHM ఉద్యోగి మరణించినట్లయితే వారి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.

ఈ డిమాండ్లను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పరిశీలించి, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని NHM ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

డా. భరత్, డా. రవీందర్, డా. కిరణ్, డా. రామరాజు, డా. సదానందం, డా. యశస్విని, డా. హరికృష్ణ, అనిల్, కర్నెల్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రజినీ కుమార్ Hnk.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.