📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపాలకుర్తి పట్టణంలో వార్డు సభ్యులు కళ్యాణి సందీప్ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే...

పాలకుర్తి పట్టణంలో వార్డు సభ్యులు కళ్యాణి సందీప్ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

పాలకుర్తి పట్టణంలో వార్డు సభ్యులు కళ్యాణి సందీప్ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): పాలకుర్తి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగిన వార్డు సభ్యులు కళ్యాణి – సందీప్ నూతన గృహప్రవేశ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి హాజరయ్యారు.

ముందుగా నూతన గృహంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, నూతన గృహ యజమానులు కళ్యాణి సందీప్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంట్లో వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో నిత్యం సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.

ఈ గృహప్రవేశ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.