📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజుక్కల్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

జుక్కల్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

జుక్కల్ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్ సేట్

పండుగ వేళ చెరువుల వద్ద, డీజే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జుక్కల్ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా యువత డీజే కార్యక్రమాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువుల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు నీటిలోకి దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రజలందరూ భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని జుక్కల్ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్ సేట్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.