సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్
పండుగ వేళ చెరువుల వద్ద, డీజే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 27
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా యువత డీజే కార్యక్రమాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువుల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు నీటిలోకి దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రజలందరూ భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ఆకాంక్షించారు.

