అనంతపురం మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం
బిజెపిలో త్రిముఖ పోటీ
ప్రముఖ నర్సింగ్ ఓం హోం ఎండి డాక్టర్ విక్రమ్, బిజెపి జిల్లా అధ్యక్షులు, కొనకండ్ల కురుబ రాజేష్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ ఆజేష్ యాదవ్ మధ్య పోటీ
బిజెపి అగ్రనేతలు చర్చలు జరుపుతున్న వైనం
అనంతపురం బ్యూరో అక్టోబర్ 16 ప్రజా వాణి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. తొలుత అనంతపురం మేయర్ స్థానాన్ని టిడిపికి కేటాయించాలని టిడిపి అగ్ర నేతలకు జిల్లా మంత్రులు, జిల్లా టిడిపి నాయకులు కోరినట్లు తెలిసింది. అయితే ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి తో పాటు బిజెపి, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అనంతపురం నగరంలో బలిజ సామాజిక వర్గ జనాభా ఎక్కువగా ఉండడంతో తొలుత జనసేన పార్టీకి ఇవ్వాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీ సి వరుణ్ తోపాటు, జనసేన పార్టీ జిల్లా నాయకులు అనంతపురం మేయర్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రముఖ భాగస్వామిగా ఉన్న బిజెపి అగ్ర నేతలు పట్టు పట్టడంతో బిజెపి పార్టీకి కేటాయించారు.అనంతపురం జిల్లాలో టిడిపికి 13 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో ఇద్దరూ మంత్రులు, ఇద్దరు ఎంపీలు ఉన్న విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో బిజెపి ఎమ్మెల్యేగా మంత్రిగా సత్య కుమార్ ఉన్న విషయం అందరికీ
తెలిసిందే. అయితే చాలామంది టిడిపి మంత్రులు, టిడిపి శ్రేణులు తమకే మేయర్ స్థానాన్ని కేటాయిస్తారని ఊహించినప్పటికీ ఆ కళ నెరవేరలేదు. దీంతో
కూటమి ప్రభుత్వం లోని అగ్ర నేతలు చర్చించి
బిజెపి పార్టీకి కేటాయించారు. గత రెండు రోజుల క్రితమే బిజెపి పార్టీకి మేయర్ స్థానాన్ని కేటాయించారు. బిజెపి పార్టీ లో ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు. బిజెపి పార్టీ తరపున బిజెపి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కురుబ కొనకొండ్ల రాజేష్ తనకే టికెట్టు కేటాయించాలని అధిష్టానం వద్ద ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కొనకొండ్ల కురుబ రాజేషు కురుబ సంఘం జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా పనిచేశారు. అనంతపురం నగరంలో కురుబ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గ ఓటర్లు తోపాటు బిసి సామాజిక వర్గ ఓటర్లు తనకు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థికంగా వీక్ గా ఉన్నారని పలువురు భావిస్తున్నారు.ప్రముఖ కృప నర్సింగ్ హోం ఎండి డాక్టర్ వసుంధర దేవి తనయుడు డాక్టర్ విక్రమ్ తనకే సీటు కేటాయించాలని అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ డాక్టర్ విక్రమ్ కు సమీప బంధువు కావడం తో తనకే మేయర్ టికెట్ వస్తుందని భావిస్తున్నారు. అనంతపురం నగరంలో డాక్టర్ వసుంధర దేవి ఫేమస్ డాక్టర్ గా గుర్తింపు పొందారు. వసుంధర దేవి తనయుడు డాక్టర్ విక్రమ్
వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆర్థికంగా ఫుల్ సౌండ్ గా ఉన్నట్లు సమాచారం. తనకు బి. సి కులాల తో పాటు ఇతర సామాజిక వర్గాల ఓటర్లు మద్దతు తెలుపుతారని డాక్టర్ విక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ విక్రమ్ ఫుల్ సౌండ్ కావడంతో బిజెపి నేతలు విక్రమ్ కే సీటు కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆజేశ్ యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు కావడంతో పాటు ప్రస్తుతం
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆజేష్ యాదవ్ గత పది సంవత్సరాల నుంచి బిజెపి పార్టీకి సేవలు అందిస్తున్నారని ప్రస్తుతం మేయర్ టికెట్ను తనకు కేటాయించాలని బిజెపి నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
oగత మూడు రోజులుగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి లోపు బిజెపి అగ్ర నేతలు టికెట్ కన్ఫామ్ చేస్తారని తెలుస్తోంది. నామినేషన్లు పక్రియ మొదలు కావడం ఆఖరు తేదీ 18 తేది కావడం తో అతి త్వరగా బిజెపి అగ్రనేతలు టికెట్ కన్ఫామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

