📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

📰 Generate e-Paper Clip

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మన ప్రజావాణి:-
*మంచిర్యాల జిల్లా*

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల ప్రభుత్వ మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను, వైద్య పరికరాలు, కార్డులు, రిజిస్టర్లు, వివిధ విభాగాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసియూ గదులను, పడకలు, పిల్లల విభాగంలో ఏసీలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వారి బరువు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా వైద్యులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోగులకు వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఇంకా సదుపాయాలు, వైద్య పరికరాలు, ఏసీలు ఇతరత్రా అవసరం ఉన్నట్లయితే వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని, మరమ్మతులకు గురైనట్లయితే వెంటనే మరమ్మతులు చేయించాలని, రోగులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి అధికారులు కోరిన అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించి వచ్చి గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అశోక్ కుమార్, ఆర్‌ఎంఓ డా. శ్రీధర్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.