📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా

దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా

📰 Generate e-Paper Clip

దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా

అక్టోబర్ 16. ప్రజావాణి న్యూస్/ సంగెం

సంగెం పోలీస్ స్టేషన్. వరంగల్. పోలీస్ కమిషనరేట్. సమర్థవంతంగావిధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటురూ.10,000 జరిమానా విధిస్తూ వరంగల్ రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.వివరాల్లోకి వెళితే, సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన గూడ రవీందర్‌ పై అదే గ్రామానికి చెందిన గూడ సంపత్ దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి 2016 సంవత్సరంలో సంగెం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 65/2016, ఐపీసీ సెక్షన్ 325 రెడ్ విత్ 34 కింద కేసు నమోదైంది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. సీసీ నంబర్5255/2022గా విచారణ జరిగిన ఈ కేసులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి బి.వి.వి. చంద్రప్రసన్న నిందితుడు గూడ సంపత్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసు దర్యాప్తులో అప్పటి పోలీస్ అధికారులు గాలిబ్ షరీఫ్, వి. క్రాంతికుమార్, ఎస్. దీపక్ పాల్గొన్నారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వరి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ మాచర్ల కార్తీక్ (PC-2535), కోర్టు లైజన్ ఆఫీసర్ హరికృష్ణ, కోర్టు ప్రాసెస్ సర్వర్ హోంగార్డు సదయ్య లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.