తొర్రూర్
అక్టోబర్ 16(ప్రజావాణి)
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (TSJU) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పంతం సురేందర్ నియమితులయ్యారు.
టీఎస్ జేయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు గణపనేని చంద్రశేఖర్ పంతం సురేందర్కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన పంతం సురేందర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, టీఎస్ జేయు యూనియన్ బలోపేతానికి జర్నలిస్టుల పక్షాన నిలబడి పనిచేస్తానని పేర్కొన్నారు.

