📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుల్కచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

కుల్కచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

📰 Generate e-Paper Clip

కుల్కచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి..

పరిగి/కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 16:

కుల్కచర్ల మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా గదిర్యాల్ గ్రామానికి చెందిన పక్కిరి మల్లిక్ (35) చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో మల్లిక్ కుల్కచర్ల నుంచి తన స్వగ్రామమైన గదిర్యాల్‌కు బయలుదేరాడు.
మార్గమధ్యలో రాముకు రైస్ మిల్ సమీపానికి చేరుకోగానే, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ (నంబర్: TS 13 UC 5888) అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లిక్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.