📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. దివ్య అలంకరణలో భవానీ మాత

కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. దివ్య అలంకరణలో భవానీ మాత

📰 Generate e-Paper Clip

కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. దివ్య అలంకరణలో భవానీ మాత!

ఐదవ రోజు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి దర్శనం

ఝరాసంగం, అక్టోబర్ 16 (ప్రజావాణి):

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు భవానీ మాతను దివ్యంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి అందమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

జహీరాబాద్‌కు చెందిన సత్యం శివం సుందరం భజన మండలి ఆధ్వర్యంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఆదిశక్తి స్వరూపిణి అయిన భవానీ మాత కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తున్నాయి. అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. భక్తి, శక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ వేడుకలు కుప్పానగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.