కుప్పానగర్లో ఆధ్యాత్మిక వైభవం.. దివ్య అలంకరణలో భవానీ మాత
కుప్పానగర్లో ఆధ్యాత్మిక వైభవం.. దివ్య అలంకరణలో భవానీ మాత! ఐదవ రోజు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి దర్శనం ఝరాసంగం, అక్టోబర్ 16 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు భవానీ మాతను దివ్యంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి అందమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జహీరాబాద్కు చెందిన సత్యం శివం సుందరం భజన మండలి ఆధ్వర్యంలో భక్తిమయ వాతావరణం నెలకొంది....