పుట్టాపహాడ్లో వైభవంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రేని హనుమయ్య కుటుంబ సభ్యులు
పరిగి:అక్టోబర్ 15( ప్రజావాణి)
పుట్టాపహడ్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజూ ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు రేని హనుమయ్య కుటుంబ సభ్యులు పాల్గొని జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా రేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మాత కరుణాకటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

