పుట్టాపహాడ్లో వైభవంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు
పుట్టాపహాడ్లో వైభవంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రేని హనుమయ్య కుటుంబ సభ్యులు పరిగి:అక్టోబర్ 15( ప్రజావాణి) పుట్టాపహడ్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజూ ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు రేని హనుమయ్య కుటుంబ సభ్యులు పాల్గొని జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, వారికి తీర్థప్రసాదాలు...