📄 ePaper
Epaper 2
Friday, October 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్

మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును (కేటీఆర్)ను గురువారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండలానికి సంబంధించిన పలు రాజకీయ,స్థానిక అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన,ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని,పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, శ్రేణులందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను,వాటి అమలు తీరును ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించినట్లు సమాచారం.
పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా చర్చించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.