📄 ePaper
Epaper 2
Friday, October 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఆర్ఎంపీ ,పీ ఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ఆర్ఎంపీ ,పీ ఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

 

ఆర్ఎంపీపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు మల్లేష్. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి*

*ఆర్.ఎం.పి పి.ఎం.పి తొర్రూరు మండల నూతన కమిటీ ఎన్నిక*

 

తొర్రూరు
అక్టోబర్ 15 (ప్రజావాణి)

 

గ్రామీణ వైద్యులందరూ సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆర్ఎంపీ పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు మల్లేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి లు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో తొర్రూరు మండల గ్రామీణ వైద్యుల కమిటీని నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారపు భీమయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు గడ్డం రాజమౌళి ల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొర్రూరు మండల అధ్యక్షుడిగా గద్దల వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన్యం వెంకన్న, ప్రధాన కార్యదర్శి గా కొమ్మనబోయిన యాకయ్య, కోశాధికారి మంగళపల్లి ప్రకాష్, ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గ అధ్యక్షులు మల్లేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి జిల్లా కార్యదర్శి అన్నపురపు వెంకన్న లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటితంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులు జిలకర నాగన్న, నిమ్మల శీను, మదనాచారి, అబ్దుల్లా, పల్లె రవి, రాము గౌడ్, దామోదర్, వినమాల రవి, గుండాల వేణు, యాకన్న, సందీప్, ఐలయ్య, సిద్ధూ, నితీష్, రాజేష్, మరో 20 మంది గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.