*శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కల్వకుర్తిలో ప్రత్యేక పూజలు !..*
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి/అక్టోబర్ 15 ప్రజావాణి.
శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఐదవ రోజు శ్రీ లలితా మాత అలంకారంతో దర్శనమిచ్చిన అమ్మవారిని నాగర్కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోతుగంటి రాములు గారితో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ రమేష్ బాబు సేటు గారు, నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్, కార్యదర్శి నారాయణ రాజు, పానుగంటి నవీన్, కోశాధికారులు గుబ్బకిషన్, వాస మనీష్,పట్టణ వైశ్య సంఘం ప్రతినిధులు వాసా శేఖర్, చిగుల్లపల్లి శ్రీధర్, గంధం ప్రసాద్, బీచనీ బాలకృష్ణ,పాలుట్ల జంగయ్య, ముత్యాలు, గంప శీనుఅలాగే బాబీ దేవ్, రామకృష్ణ, మనీష్, నవీన్, ఎల్లయ్య సేటు, రామనాథం సేటు తదితరులు పాల్గొన్నారు.

