ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరుగుతుందని వెల్లడి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): జిల్లా లోని
లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో గురువారం ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ.. “గ్రామంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు ఐకేపీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఈ సెంటర్ ద్వారా సులభంగా అందుతాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, జీపీవో ఎండి జబ్బర్, గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు కొయ్యడ అనిల్, వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, బండారి మమత అశోక్, బత్తిని వేణు, సిఏ రేవతి, మాజీ ఎంపీటీసీ మోటే వీరస్వామి, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు నర్సింగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వాసవి విఓ ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులు, హమాలీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

