📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు

పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు

📰 Generate e-Paper Clip

*పట్టపగలే గ్రామంలో వీధిదీపాల వెలుగులు..*
*బావుల వద్ద రైతుల ఎదురుచూపులు!*

*గ్రామంలో విద్యుత్ వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడా?*
*అధికారుల కళ్లకు ఈ సమస్యలు కనిపించడం లేదా?*

రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 15 (ప్రజావాణి):మంచాల గ్రామంలో ఒకవైపు పట్టపగలే వీధిదీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతుంటే, మరోవైపు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామంలో వీధిదీపాలు పగటిపూట కూడా వెలుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు మాత్రం తమ పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ సరఫరా కోసం బావుల మోటార్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

వీధిదీపాలపై పర్యవేక్షణ ఏదీ?

గ్రామంలో ప్రజలకు రాత్రివేళ వెలుతురు అందించాల్సిన వీధిదీపాలు పట్టపగలే వెలుగుతూ కనిపిస్తున్నాయి. విద్యుత్‌ను ఆదా చేయాల్సిన సమయంలో ఇలా అనవసరంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు ఏర్పడే అవకాశం ఉంది. వీధిదీపాలు ఎప్పుడు వెలుగుతున్నాయి? ఎప్పుడు ఆరిపోతున్నాయి? వాటి నిర్వహణ సక్రమంగా ఉందా? అనే విషయాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై లేదా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

పగటిపూట వీధిదీపాలు వెలుగుతున్న విషయం అధికారుల దృష్టికి రావడం లేదా? లేక తెలిసినా పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో నిర్వహించే విద్యుత్ సదుపాయాలను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బావుల వద్ద రైతుల పడిగాపులు!

వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులు తమ పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ సరఫరాపై ఆధారపడుతున్నారు. అయితే విద్యుత్ కోసం బావుల వద్ద, మోటార్ల దగ్గర రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని. ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.