సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
నీటి నిల్వలు, ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష
మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 15: సింగూర్ జిల్లా ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాజెక్టు నీటి నిల్వల పరిస్థితిని సమీక్షిస్తూ, భవిష్యత్తులో నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరుల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.
ఈ పర్యటనలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

