📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆ వ్యవహారంలో ఇంకా కొనసాగుతున్న హైడ్రామ

ఆ వ్యవహారంలో ఇంకా కొనసాగుతున్న హైడ్రామ

📰 Generate e-Paper Clip

ఆ వ్యవహారంలో ఇంకా కొనసాగుతున్న హైడ్రామ..?

నివేదిక అందించడంలో జాప్యం చేస్తున్న కల్లూరు డిఎల్పిఓ

కలెక్టర్ ఆదేశాలు ఉల్లంఘనలు..?

*11 నెలలు గడుస్తున్న బాధితులకు దక్కని న్యాయం..

*చింతకాని పందిళ్ళపల్లి వ్యవహారంలో ఎటు తేల్చని అధికారులు..?

*నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేల్చారు చర్యలు మరిచారా…?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమాలతో పాటు. పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కాసుల కక్కుర్తికి చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు ను మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసి ఇటీవల వెలుగు చూసిన తర్వాత రికార్డులను బుట్ట దాఖలు చేసి వ్యవహారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఎంపీ ఓ పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శి పై కూడా పలు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కాలిపోలేదు అంటూ సాక్షాత్తు చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ సమయంలో విధులు నిర్వహించని సదరు అవినీతి పంచాయతీ కార్యదర్శి నిర్వహించినట్లు అధికారులను తప్పుదారి పట్టించి క్షేత్రస్థాయిలో విఫలమైనట్లు అధికారులు తోపాటు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చింతకాని ఎంపీ ఓ రికార్డులను రిపోర్టులను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం పై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక బాధితుల కు అండగా సమగ్ర వార్తా కథనాలు అందించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఖమ్మం జిల్లా కల్లూరు డిఎల్పిఓ విజయలక్ష్మిని విచారణ అధికారిగా నియమించి నివేదిక అందించాలని ఆదేశించినప్పటికీ విచారణ పూర్తి చేశారు కానీ నివేదిక అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు ప్రజాసంఘాల నేతలు హక్కుల సంఘాలు నిలదీస్తున్నాయి. కొంతమంది జర్నలిస్టులు సంప్రదిస్తే రిపోర్టు పెట్టాం అంటూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ కాలయాపన చేయటంతో బాధిత కుటుంబం తీవ్ర మనోవేదంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కాగా ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు కలెక్టర్లు బదిలీ జరిగిన కానీ నేటి వరకు అక్రమంగా రికార్డులలో నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శులపై ఆన్లైన్ చేసిన మరో అధికారి రిజిస్ట్రేషన్కు సహకరించిన తాజా కార్యదర్శి పై చర్యలు తీసుకునేందుకు సమయం దొరకకపోవడంతో తీవ్ర విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ డిపిఓ తీసుకునే చర్యలపై ఉత్కంఠత నెలకొనదని సమాచారం. సివిల్ సర్వీసెస్ చట్టాలను ఉల్లంఘించి నిబంధనలు పక్కనబెట్టి దర్జాగా రికార్డులలో నమోదు చేసి కాసులను దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న వేళ సమగ్ర విచారణ ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.