📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం నిరవాదిక సమ్మె

NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం నిరవాదిక సమ్మె

📰 Generate e-Paper Clip

NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం నిరవాదిక సమ్మె

కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మేము
నేడు మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం

ప్రజావాణి అక్టోబర్ 13 NHM ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట NHM ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కాంటాక్ట్ ఔర్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిర్వాహక సమ్మె కార్యక్రమం

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన వారి సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవ వేతనం చెల్లించాలని కోరారు
గత ప్రభుత్వం హయంలో కొన్ని సమస్యలు పరిష్కారమై ఉండవచ్చునని మరికొన్ని పరిష్కారం కాకపోగ గతంలో పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలన్నారు

ప్రభుత్వ వైద్య ఆరోగ్యం శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔర్సోర్సింగ్ ఉద్యోగులందరికీ న్యాయం జరగాలని వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

ప్రజా ఆరోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వo విఫలం అవుతుందని అన్నారు
NHM ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.